NTV Telugu Site icon

Newly Elected MLCs Meet CM YS Jagan: సీఎంను కలిసి కొత్త ఎమ్మెల్సీలు.. అభినందించిన వైఎస్‌ జగన్‌

Mlcs

Mlcs

Newly Elected MLCs Meet CM YS Jagan: తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగిన విజయం సాధించిన ఎమ్మెల్సీలు ఇవాల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు.. బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతోన్న నేపథ్‌యంలో.. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నర్తు రామారావు, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్‌.. తమకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలను అభినందించారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఇక, కొత్త ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని కలిశారు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ జరగగా.. 16వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు.

Read Also: Minister KTR: ఇది ఇద్దరు దుర్మార్గులు చేసిన తప్పిదం.. పేపర్ లీకేజ్‌పై కేటీఆర్ స్పష్టత