NTV Telugu Site icon

విశాఖ రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక… కొత్త నిబంధనలు అమలు 

రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విశాఖ రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.  రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు చేయబోతున్నారు.  రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లే దారి, బయటకు వచ్చేదారి వేరువేరుగా ఏర్పాటు చేయబోతున్నారు.  రైల్వేస్టేషన్ కి వచ్చే ప్రయాణికులు జ్ఞానాపురం గెట్ వద్దనున్న ఎనిమిదో నెంబర్ ప్లాట్ ఫామ్ మీదుగా లోపలికి అనుమతిస్తారు. థర్మల్ స్క్రీనింగ్ తరువాతే లోనికి అనుమతించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.  స్టేషన్ నుంచి బయటకు వెళ్లేవారికి ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ నుంచి అనుమతి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.  విశాఖ రైల్వే స్టేషన్ లో ఎవరూ గుంపులుగా ఉండొద్దని  ప్రయాణికులకు సూచించారు.  సాధ్యమైనంత వరకు ఎవరి ఆహరం వారే తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.  ఇప్పటికే ఏసీ బోగీల్లో దుప్పట్లు, బెడ్ షీట్లు సరఫరా లేదని, కర్టెన్లు కూడా తొలగించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తరచుగా చేతులను శానిటైజ్ చేసుకోవాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.