Site icon NTV Telugu

BREAKING : ఉగాది నుంచే ఏపీలో కొత్త జిల్లాలు

ఏపీలో ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా 13 జిల్లాలను కలుపుతూ 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఉగాది నుంచే కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని సీఎం జగన్‌ తెలిపారు. నేడు సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు నిర్వహించాలని, దానికి సంబంధించిన సన్నాహాలు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. ప్రస్తుతమున్న కలెక్టర్లు, ఎస్పీలకు కొత్త జిల్లాల బాధ్యతలు అప్పగించాలని సూచించారు.

పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని సీఎం జగన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ వచ్చిన రోజునుంచే ఓఎస్డీల హోదాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు నిర్వహిస్తారని జగన్‌ వెల్లడించారు. 13 జిల్లాలు.. 1. మన్యం 2. అల్లూరి సీతారామారాజు 3. అనకాపల్లి 4. కాకినాడ 5. కోనసీమ 6. ఏలూరు 7. ఎన్టీఆర్‌ 8. బాపట్ల 9. పల్నాడు 10. నంద్యాల 11. శ్రీ సత్యసాయి 12. అన్నమయ్య 13. శ్రీ బాలజీ లుగా కొత్తగా ప్రతిపాదించారు.

Exit mobile version