వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే అధిష్టానం ఆయనను పక్కన పెట్టింది. నన్ను రాజ్యాంగేతర శక్తి అని ఆయన అనడం సరికాదు. ఆత్మకూరులో కోట్లు పెట్టి అభివృద్ధి చేశానని చెప్పారు.
Read Also: Prabhas Fans: మీ కష్టం ఎవరికీ రాకూడదు మావా… దర్శక నిర్మాతలు ఏమైపోయారో
ఎన్నికల్లో 8 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాంటి ఆనం కు వెంకటగిరిలో అన్ని వేల ఓట్ల మెజారిటీ జగన్ వల్లే వచ్చింది. దానిని మరిచిపోయి ఎం.ఎల్.ఏ.గా టికెట్ ఇచ్చి గెలిపిస్తే విమర్శలు ప్రారంభించారు. మంత్రి పదవి ఇవ్వలేదని ఆయనకు బాధగా ఉందన్నారు. నిత్యం ప్రభుత్వం పై విమర్శలు చేసారు.ఆయనను అధిష్టానం పిలిచి మాట్లాడినా అదే ధోరణి కొనసాగించారు. అందుకే ఆయనను తప్పించి నన్ను సమన్వయ కర్త గా నియమించారు. ఆత్మకూరులో ఓడిపోయి..టిడిపి.లో చేరి ఇంచార్జ్ గా ఉంటూ ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు ఎలా చేశారు? కేబినేట్ ర్యాంక్ ఉన్న నా పేరు ను శిలాఫలకాల పై వేయనీయలేదు.
Read Also:Bandi sanjay: నమ్మకం లేదన్నా నోటీసులు ఇచ్చారు.. నేడు సిట్ ముందుకు లీగల్ టీం
సజ్జల విలేకరిగా పని చేసి ఉండవచ్చు.కానీ ఎప్పటినుంచో వ్యాపారాలు చేస్తున్నారుఆనం ఏమి చేసి ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించారో సమాధానం చెప్పాలి. ఏ పార్టీలోకి వెళ్ళాలనే విషయం పై ఆనంకు స్పష్టత లేదు.వెంకటగిరిలో తన పి.ఏ.ద్వారా ఆనం పలు అక్రమాలకు పాల్పడ్డారు. వీటిపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే జైలుకు కూడా పంపుతాం. తవ్వే కొద్దీ అవినీతి బయట పడుతోంది. పెద్ద కుటుంబానికి చెందిన నేత ఇలా అవినీతికి పాల్పడటం పై ఆశ్చర్యానికి గురయ్యాను. అవసరమైతే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి కమిటీతో విచారణ చేయిస్తాం అన్నారు రాంకుమార్ రెడ్డి.