Site icon NTV Telugu

సీఎం జగన్ ను కలిసిన నావికా దళం అధికారులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆయన నివాసం మర్యాదపూర్వకంగా తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ కలిశారు. డిసెంబర్‌ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను తూర్పు నావికాదళ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్‌ ఈ సందర్భంగా ఆహ్వనించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్దనౌక ఐఎన్‌ఎస్‌ విశాఖపట్టణం త్వరలో ప్రారంభం కానున్నదని సీఎం జగన్‌ కు వివరించారు ఈఎన్‌సీ సీఐఎన్‌సీ.

అంతేకాక ఫిబ్రవరి 2022లో జరగనున్న పిఎఫ్‌ఆర్‌ అండ్‌ మిలన్‌ 2022 నిర్వహణకు సంబంధించిన సన్నాహాల పురోగతిని కూడా ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. ఈఎన్‌సీ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ను సన్మానించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

Exit mobile version