Site icon NTV Telugu

CM Chandrababu: తిరుపతిలో మహిళా సాధికారత సదస్సు.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు

Chandrababu

Chandrababu

CM Chandrababu: నేటి నుంచి రెండు రోజులు పాటు తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు జరగనుంది. పార్లమెంట్ తో పాటు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు చెందిన సుమారు వంద మంది మహిళా ప్రజా ప్రతినిధుల హాజరు కానున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో జాతీయ సదస్సు జరగబోతుంది. ఈ ప్రారంభ వేడుకకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. తిరుపతి నగరంలోని రాహుల్ కన్వెన్షన్ లో రెండు రోజుల పాటు జాతీయ సదస్సు కొనసాగనుంది.

Read Also: Zohran Mamdani: న్యూయార్క్‌లో నెతన్యాహూను అరెస్ట్ చేయిస్తా.. మమ్దానీ వార్నింగ్..

అయితే, చట్టసభల్లో మహిళా ప్రజా ప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలు, సాంకేతిక సవాళ్లు అధిగమించడంలో మహిళా సాధికారత పాత్ర.. తదితర అంశాలపై రెండు రోజులు సదస్సులో చర్చించనున్నారు. అలాగే, ఈరోజు సాయంత్రం చంద్రగిరి కోటను సందర్శించనున్న మహిళా ప్రజా ప్రతినిధులు.. రేపు తిరుమల శ్రీవారి దర్శనం, శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. కాగా, రేపు సదస్సు ముగింపుకు ముఖ్యఅతిథిగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు.

Exit mobile version