NTV Telugu Site icon

Andhra Pradesh: డీజీపీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఇటీవల ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ స్థానంలో కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. తనపై సీఐడీ అధికారుల దాడి ఘటనపై త్వరగా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. తప్పుడు కేసులు బనాయించి తనను చిత్రహింసకుల గురిచేశారని డీజీపీకి రఘరామకృష్ణంరాజు వెల్లడించారు.

తనపై దాడి చేసిన వారిలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కూడా ఉన్నారని డీజీపీకి రాసిన లేఖలో రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ ఘటనపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నివేదిక కోరినా అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించలేదని రఘురామ ఆరోపించారు. లోక్ సభ స్పీకర్ కోరిన మేరకు నివేదికను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు వ్యవస్థపై మళ్లీ విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాత రీతిలో దర్యాప్తు జరపాలని కోరారు.