Site icon NTV Telugu

Narayana Swamy : జగన్ హీరోగా సినిమా తీస్తే వెయ్యి రోజులు ఆడుతుంది

ఏపీ సీఎం జగన్‌ నేడు జగనన్న తోడు పథకం లబ్దిదారులకు నేరుగా వారి అకౌంట్లలో నగదు జమచేశారు. చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాల ఇచ్చి వారికి అండగా నిలిచారు. అయితే ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. నవ రత్నాల లబ్ధిదారులు కూడా రాక్షస మనస్తత్వంతో చంద్రబాబు వెంట వెళుతున్నారని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సినిమాపై చంద్రబాబు అనవసర రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు.

అంతేకాకుండా అఖండ, పుష్ప, బంగార్రాజు లాంటి సినిమాలు కూడా హిట్టయ్యాయని ఆయన తెలిపారు. సినిమా దెబ్బతింటే హీరోలు నిర్మాతలను ఆదుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. హీరోలు ఎవ్వరూ పేదలను ఆదుకుంది లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సీఎం జగన్‌ రియల్‌ హీరో అన్న ఆయన.. జగన్ హీరోగా పెట్టి సినిమా తీస్తే వెయ్యి రోజులు ఆడుతుందని అన్నారు.

Exit mobile version