టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే తాను లోకేష్ ని ఉద్దేశించి ఎలాంటి అనుచిత కామెంట్లు చేయలేదని వివరణ ఇచ్చారు నారాయణస్వామి. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి నాతో మాట్లాడారు. ఆ వ్యక్తిని ఉద్దేశించి నేను చేసిన కామెంట్లని తనను ఉద్దేశించినట్టుగా లోకేష్ భావిస్తున్నారు.
సభలో అలాంటి కామెంట్లు చేయకూడదు.. నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. నన్ను ఏ స్థాయిలో రెచ్చగొడితే నేను అలా మాట్లాడానో గమనించాలి. బడుగులకు న్యాయం చేస్తోన్న ప్రభుత్వాన్ని కూలగొడతామంటే కోపం రాదా..? సీఎం జగన్ ని వాడూ వీడూ అని ఇష్టానుసారంగా లోకేష్ మాట్లాడుతున్నారు. మద్యనిషేధం.. మద్య నియంత్రణ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. యనమలకు వియ్యంకుడు.. అయ్యన్నపాత్రుడు వంటి వారు మద్యం డిస్టలరీలు నడుపుతున్నారు.
ఇటీవలే అయ్యన్నపాత్రుడు తన డిస్టలరీలను అమ్ముకున్నారట. పదవుల కోసం టీడీపీ వాళ్లూ అర్రులు చాస్తారు.. వైసీపీ వాళ్లు పదవుల గురించి అర్రులు చాచరు. ఎస్సీలను చులకనగా చూసేది చంద్రబాబే. మైనార్టీ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారు లోకేష్. చంద్రబాబు, లోకేష్ వంటి వారు అబద్దాల్లో పెరిగి.. అబద్దాలతోనే రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు ఔరంగజేబు కోవకు చెందిన వాడు.
చంద్రబాబు ఏనాడైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా..? చంద్రబాబులో ఇంకా మార్పు రాలేదు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్లకూ సంక్షేమ పథకాల లబ్జి జరుగుతోందన్నారు నారాయణస్వామి. జగన్ ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. జగన్ పరిపాలన రామరాజ్యాన్ని తలపిస్తోంది. ఖరీదైన మద్యాన్ని 10-15 ఏళ్లపాటు తాగితే.. శరీరంలో ఆల్కహాల్ ఉంటుంది. తాగుడుకు అలవాటు పడిన వాళ్ల ఆరోగ్యం సరిగా ఉండదన్నారు నారాయణ స్వామి.
