Site icon NTV Telugu

చెప్పులపై జీఎస్టీ వేయడమేంటి..?: నారాయణ

ఏ అంశంపైనా ప్రజా ఉద్యమాలు చేయాలన్నా ఎర్ర పార్టీల స్టైలే వేరు.. ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసన చేపట్టడం వారికే చెల్లుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు.చెప్పులను నెత్తిపై పెట్టుకున్న వినూత్నంగా నిరసన తెలిపిన నారాయణ. చెప్పులను వేసుకోవడం కాదు తలపై పెట్టుకునే దుస్థితికి బీజేపీ తీసుకొచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పులపై జీఎస్టీ వేయడమేంటని ప్రశ్నించారు. జీఎస్టీతో దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. విజయవాడలో పరువు పొగొట్టి గుంటూరులో జిన్నా టవర్ వద్ద వీర్రాజు తన పరువు వెతుక్కుంటున్నాడని ఎద్దేవా చేశారు. సోమువీర్రాజుకు సారాయి వీర్రాజు అన్న పేరు సార్థకమవుతుందనన్నారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు.

Also Read: బాల్య వివాహాలపైన మహిళా కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది : వాసిరెడ్డి పద్మ

కంగనా రనౌత్ విలాసవంతమైన భిక్షగత్తె.. అని విమర్శించారు. రైతులకు అండగా నిలబడితే సోనూసూద్‌పై కేసులు, విప్పి చూపించే కంగనా రనౌత్‌కు పద్మశ్రీనా అంటూ ఫైర్‌ అయ్యారు.
ఏపీలో పోలీసు, రౌడీ వ్యవస్థ కలిసిపోయిందన్నారు. ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలకు సీఎం ఏం సమాధానం చెబుతారన్నారు. పీఆర్సీని పే రివర్స్‌ కమిషన్‌గా వైసీపీ మార్చిందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ మండిపడ్డారు. జనవరి 26 నుంచి సీపీఐ జాతీయ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.

Exit mobile version