NTV Telugu Site icon

Lokesh Vizag Tour: కోర్టులో హాజరుకానున్న లోకేష్

టీడీపీ నేత నారా లోకేష్ రేపు విశాఖ వెళ్లనున్నారు. విశాఖ కోర్టులో ఓ పరువు నష్టం కేసుకి హాజరుకానున్నారు లోకేష్. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రిక పై లోకేష్ రూ. 75కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు లోకేష్. 2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేష్ ప్రజాధనంతో రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని పత్రికలో కథనం ప్రచురించింది. పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో లేనన్నారు నారా లోకేష్. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిధుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చును తనపై అసత్యాలతో ప్రచురించారంటూ రూ. 75 కోట్లకు పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి విశాఖ కోర్టుకు స్వయంగా రేపు హాజరుకానున్నారు లోకేష్.

మరోవైపు శ్రీకాళహస్తి నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇన్ ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి తమకు అందుబాటులో ఉండటం లేదు అని చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు నేతలు. బొజ్జల సుధీర్ తో కొద్దిసేపు విడిగా మాట్లాడారు చంద్రబాబు.స్థానికంగా ఉన్న ఫీడ్ బ్యాక్ ను సుధీర్ కు వివరించారు చంద్రబాబు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని బొజ్జల సుధీర్ రెడ్డికి సూచించారు చంద్రబాబు. పనితీరు మెరుగు పరుచుకోవాలని సుధీర్ రెడ్డికి సూచించారు చంద్రబాబు.

తండ్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఏ విధంగా కష్టపడ్డారో అదే విధంగా కష్టపడాలని సుధీర్ కు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఇకపై నియోజకవర్గ నేతలతో నిత్యం అందుబాటులో ఉంటానని చంద్రబాబు సమక్షంలో నేతలకు స్పష్టం చేశారు సుధీర్ రెడ్డి. కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో మళ్లీ పసుపు జెండా ఎగరవేయాలని నేతలకు చంద్రబాబు ఆదేశించారు.