మంగళగిరి ఎమ్మెల్యే ఓ గెస్ట్ లెక్చరర్: నారా లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆర్కే గెస్ట్ లెక్చరర్‌గా మారారని ఎద్దేవా చేశారు. వారానికి ఒకసారి నియోజకవర్గానికి వచ్చి నాలుగు ఫోటోలు దిగి జంప్ అవుతున్నారంటూ లోకేష్ ఆరోపించారు. గురువారం నాడు మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు తాగునీరు, ఇళ్ల పట్టాల సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. రకరకాల కారణాలు చెబుతూ దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్లు కట్ చేస్తున్నారని లోకేష్ వద్ద పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: టీడీపీ-జనసేన పొత్తు..! సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
30 ఏళ్ల క్రితం ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు వన్ టైం సెటిల్‌మెంట్ అంటూ రూ.10 వేలు కట్టమని జగన్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.10 వేలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాత.. సొంతిల్లు ఉందనే కారణం చూపి పెన్షన్, రేషన్ కార్డ్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఆపేయడం ఖాయమని ఆరోపించారు. ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పేదలను దోచుకుంటోందని… టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క రూపాయి కూడా కట్టించుకోకుండా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
మంగళగిరి నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఈ రోజు తాడేపల్లి టౌన్ లో పర్యటించాను. తాగునీరు, ఇళ్ల పట్టాల సమస్యను ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. రకరకాల కారణాలు చెబుతూ దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్లు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.(1/3) pic.twitter.com/g5lOXdsLWF
— Lokesh Nara (@naralokesh) December 9, 2021
తాజావార్తలు
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్‌లు విధించేలా చట్టం
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!