Site icon NTV Telugu

అలిపిరి దగ్గర లోకేష్ ప్రమాణం.. జగన్‌ రాగలరా?

ముందు ప్రకటించినట్టుగానే అలిపిరిలో టీడీపీ నేత నారా లోకేష్‌  ప్రమాణం చేశారు. వివేకా హత్యలో తనకు గానీ, తమ కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి పాత్ర లేదని లోకేష్ వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి జగన్‌రెడ్డి బయటికి రాలేదని అన్నారు. చెల్లికి న్యాయం చేయలేని వాడు మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? అని లోకేష్ ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యలో జగన్‌రెడ్డి పాత్ర ఉంది.. అందుకే రాలేదని అన్నారు. తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చి ప్రమాణం చేశామని ఆయన పేర్కొన్నారు. కత్తులతో బతికే చరిత్ర ఏ కుటుంబానిదో ప్రజలకు తెలుసన్నారు. “సవాల్ చేసా వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసా. ఛాలెంజ్ కి భయపడి పులివెందుల పిల్లి పారిపోయింది. ఈ రోజు బాబాయ్ మర్డర్ మిస్టరీ వీడిపోయింది. బాబాయ్ ని వేసేసింది అబ్బాయే” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Exit mobile version