Site icon NTV Telugu

తాలిబన్లను మించిపోయారు : వైసీపీపై లోకేష్‌ సెటైర్లు !

ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు… అరాచకాలలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్లని మించిపోయారని నారా లోకేష్‌ సెటైర్లు వేశారు. తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని, నిరుపేదల ఇళ్లను జగన్ రెడ్డి కూల్చేసారని మండి పడ్డారు. ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారని..నిప్పులు చెరిగారు. తనకి 2 కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి… తన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనమన్నారు నారా లోకేష్‌. ప్రొక్లయినర్లతో పెకలించిన భరత మాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని… చేసిన మూర్ఖపుపనికి క్షమాపణలు చెప్పాలని నారా లోకేష్ డిమాండ్‌ చేశారు.

Exit mobile version