Site icon NTV Telugu

కరోనా కబలిస్తుంటే..ప్రతిపక్షాలపై కక్ష సాధింపులా? : సిఎం జగన్ పై లోకేష్ ఫైర్

మాజీ ఎమ్మెల్యేలు కూనరవికుమార్, బిసి జనార్దన్ రెడ్డి ఇవాళ అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ప్రజల్ని కరోనాకు బలిస్తూ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు పనిలో బిజీగా ఉన్నారని సిఎం జగన్ కు చురకలు అంటించారు. “సహజీవనం చేసుకోండి అంటూ ప్రజల్ని కరోనాకి బలిస్తూ ప్రతిపక్ష నేతల పై కక్షసాధింపు పనిలో బిజీగా ఉన్నారు సిఎం జగన్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత,బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డితో పాటు ఇతర నేతల పై అక్రమ కేసులు బనాయించి,అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్రమ కేసులు నిలవవు అని తెలిసినా ప్రతిపక్ష నేతల్ని వెంటాడి,వేధించి జైలుకి పంపి జగన్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారు.గతంలో చేసిన తప్పులకు పదుల సంఖ్యలో అధికారులు జైలుకి వెళ్లారు.ఇప్పుడు జగన్ రెడ్డి చేస్తున్న తప్పుడు పనులకు వందల సంఖ్యలో అధికారులు జైలుకు పోవడం ఖాయం. అక్రమ కేసులు ఉపసంహరించుకొని బిసి జనార్దన్ రెడ్డి, ఇతర నేతలను వెంటనే విడుదల చెయ్యాలి.” అంటూ లోకేష్ మండిపడ్డారు.

Exit mobile version