ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ప్రవాసాంధ్రులు తమకు అండగా నిలిచారని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. తెలుగువాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని పేరొన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుందని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. డాలస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు.
‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. స్పీడ్‌కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వారు వై నాట్ 175 అంటే.. ప్రజలే వై నాట్ 11 అని అన్నారు. ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయ్యింది, వైసీపీ 11కి ఆలౌట్ అయింది. అమెరికాలో తెలుగు వాళ్లు సత్తా చాటారు. కష్ట కాలంలో మీరంతా మా కుటుంబానికి అండగా నిలిచారు. విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుంది’ అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Also Read: Virat Kohli: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ‘కింగ్’ కోహ్లీ.. ఫొటోలు వైరల్!
‘విడాకులు, క్రాస్ ఫైర్‌లు, మిస్ ఫైర్‌లు లేకుండా మరో 15 ఏళ్లు ఎన్డీయే కూటమి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టం. మేం కక్షసాధింపులకు పాల్పడటం లేదు. సీఎం చంద్రబాబుని 53 రోజులు పాటు జైలులో ఉంచినప్పుడు ప్రవాసాంధ్రులు మాకు అండగా నిలిచారు. 2019-2024 మధ్య ఎంతటి విధ్వంస పాలన జరిగిందో అందరికీ తెలుసు. అందుకే సిద్ధం అంటూ వచ్చిన పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారు. రాబోయే రోజుల్లో రికార్డులు తిరగరాస్తాం. దేశంలో పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్‌లు ఉంటే.. ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
