NTV Telugu Site icon

డాక్టర్ సుధాకర్ చావుకు వారే కారణం… అన్ని విధాలా ఆదుకుంటాం… 

డాక్ట‌ర్ సుధాక‌ర్ ఓ మంచి డాక్ట‌ర్ అని, ఎన్నో అవార్డులు వ‌చ్చాయ‌ని, వైద్య‌వృత్తినే న‌మ్ముకొని జీవ‌నం సాగించే సుధాక‌ర్‌కు గుండు కొట్టించి హింసించార‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.  సుధాక‌ర్ ఏం త‌ప్పు చేశారో చెప్పాల‌ని, ఓ మాస్క్ అడిగినందుకు ఇంత దారుణంగా హింసించార‌ని, ఆయ‌న కుటుంబాన్ని వేదించార‌ని అన్నారు.  న్యాయం జరిగేలోపే ఆయ‌న చ‌నిపోయార‌ని, న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యే నుండి ఇక్క‌డ ఉన్న వైసీపీ నాయ‌కుల వ‌ర‌కు ఆయ‌న చావుకు కార‌ణ‌మ‌య్యార‌ని, ద‌ళితుల‌పై దాడులు చేస్తుంటే, ద‌ళిత మంత్రులు ఏమి చేస్తున్నార‌ని, ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని, వారికి న్యాయం చేసే వ‌ర‌కు పోరాటం సాగిస్తామ‌ని, ప్ర‌తిపక్షంగా చూస్తూ ఊరుకోబోమ‌ని నారా లోకేష్ పేర్కొన్నారు.