మరోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు. ‘గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా?.. వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పని చేస్తున్నాం. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. అయినా నా మాట విని మీరే గుండు కొట్టించేసుకోండి .. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం. ప్రజలే పీకుతారు…కొంచెం ఓపిక పట్టు’ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్‌లు చేస్తూ మండిపడ్డారు. అయితే ప్రస్తుతం ఏపీలో కొత్త మంత్రివర్గ హడావిడి నడుస్తోంది. ప్రస్తుతం ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారోనని ఏపీ వ్యాప్తంగా హాట్‌టాపిక్ మారింది.
https://ntvtelugu.com/preparation-for-new-ministers-sworn/
