
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఇంటర్ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులను బట్టి తరువాత పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. మే లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. ఏపీలో కరోనా పరీక్షలు లక్ష కూడా దాటడం లేదని, బెడ్స్, ఆక్సిజన్ కొరతతో చాలామంది చనిపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. జూన్ లో మళ్ళీ పరిస్థితిని బట్టి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ కు రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.