Site icon NTV Telugu

ఏపీ పోలీసులు ప్రజలవైపు ఉన్నారా.. వైసీపీ వైపు ఉన్నారా..?: నారాలోకేష్‌

టీడీపీ నేత బుద్ధా వెంకన్నను అరెస్టు చేయడంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ‌లో కొడాలి నాని క్యాసినో న‌డిపితే నో పోలీస్‌…? అదే గ‌డ్డం గ్యాంగ్ ప్రతిపక్షనేత‌ని బూతులు తిడితే నో పోలీస్‌.. చంద్రబాబు గారి ఇంటి పై దాడి చేస్తే నో పోలీస్‌…టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేస్తే నో పోలీస్‌.. ? అంటూ లోకేష్ ప్రశ్నించారు. బూతులేంట్రా స‌న్నాసి నాని అని బుద్ధా వెంక‌న్న నిల‌దీస్తే బిల‌బిల‌మంటూ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారని నారా లోకేష్‌ మండి పడ్డారు.

ఏపీ పోలీసులు ప్రజాపక్షం వైపు ఉన్నారా? నేరాలు చేసే వైసీపీ నేత‌లకు కాప‌లా కాస్తున్నారా?అంటూ విమర్శించారు. బుద్ధా వెంకన్న అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా అని నారా లోకేష్‌ అన్నారు. క్యాసినో వ్యవహారంపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం అనుమతించని డీజీపీ ఐపీఎస్‌ ముసుగులో ఎన్నాళ్లు ఇలా వైసీపీ కోసం పని చేస్తారని ఆగ్రహించారు. వైసీపీలో చేరితే వాటాల్లేకుండా మీరే క్యాసినో నడుపుకోవచ్చు అంటూ నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు.

https://ntvtelugu.com/tension-in-vijayawada-buddha-venkanna-arrest/
Exit mobile version