Site icon NTV Telugu

స్కూళ్లకు సెలవులు పొడిగించాల్సిందే.. నారా లోకేష్ డిమాండ్

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సందర్భంగా స్కూళ్లకు సెలవులు పొడిగించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు తాను లేఖ రాశానని లోకేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయని ఏపీ ప్రభుత్వానికి లోకేష్ గుర్తు చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయని లోకేష్ వివరించారు.

Read Also: విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 30 వరకు అన్ని పరీక్షలు వాయిదా

అటు 15 ఏళ్ల పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని.. ఈ సమయంలో స్కూళ్లు నిర్వహించడం చాలా రిస్క్‌తో కూడుకున్న పని అని లోకేష్ వ్యాఖ్యానించారు. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల జీవితాలతో చెలగాటం ఆడొద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు 500 నుంచి 5వేలకు పెరిగాయని.. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా 10 శాతానికి పెరిగిందని లోకేష్ అన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని స్కూళ్లకు సెలవులపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Exit mobile version