Site icon NTV Telugu

సిరివెన్నెల మరణం సినీపరిశ్రమకు తీరని లోటు : నారా భువనేశ్వరి

పద్మశ్రీ సిరివెన్నెల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పటి నుండి నిపుణుల వైద్య బృందం చికిత్స చేశారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్రం కన్నుమూశారు. అయితే సిరివెన్నెల మరణం సినీపరిశ్రమకు తీరని లోటు అని నారా భువనేశ్వరి అన్నారు. సీతారామశాస్త్రి కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.

ఇక ఈ మధ్యే ఏపీలో వచ్చిన వరదల పై ఆవిడ స్పందిస్తూ.. వరద బాధితుల ఎన్టీఆర్ ట్రస్టు అండగా ఉంటోంది అని తెలిపారు. బాధితులకు మా సాయం అందటంలో ఎన్టీఆర్ ట్రస్టు వాలంటీర్ల పాత్ర కీలకం వాలంటీర్లకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తిరుపతి సహా.. అనేక ప్రాంతాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ వరద బాధితులకు అండగా ఉంటోంది. కొత్త వేరియంట్స్ నేపథ్యంలో ఎన్టీఆర్ స్కూల్ విద్యార్థులకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రకటించారు.

Exit mobile version