Site icon NTV Telugu

నాకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదు : నారా భువనేశ్వరి

ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలకు నారా భువనేశ్వరి స్పందించారు. ఈ వ్యాఖ్యల పై ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో… ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను అన్నారు.

చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో ఉంటారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఅని తెలిపారు. కష్టాల్లో ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి అని సూచించారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను అని అందులో పేర్కొన్నారు నారా భువనేశ్వరి.

Exit mobile version