Site icon NTV Telugu

పేదల పాలిట.. ఆశా దీపం ఎన్టీఆర్ : నారా భువ‌నేశ్వ‌రి

పేదల పాలిట.. ఆశా దీపం ఎన్టీఆర్ అని నారా భువ‌నేశ్వ‌రి పేర్కొన్నారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఇటీవల వరదల కారణంగా చనిపోయిన 48 కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చోప్పున చెక్కుల‌ను అందించారు నారా భువనేశ్వరి. ఈ సంద‌ర్భంగా నారా భువనేశ్వరి…మాట్లాడుతూ… రాయలసీమలో ఇటీవల కురిసిన వర్షాలకు అనేక మంది నష్టపోయారని.. అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

https://ntvtelugu.com/cm-jagan-west-godavari-tour-tomorrow/

ఆ సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆహారం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశామ‌ని.. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామ‌ని చెప్పారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో అనేక సేవ కార్యక్రమాలు చేశామ‌ని చెప్పారు. ఎన్టీఆర్ పేరు తెలియని తెలుగు వారు ఉండరని.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వాలంటీర్ సేవలు అమోగమ‌ని పేర్కొన్నారు.

Exit mobile version