Site icon NTV Telugu

Srisailam Temple: శ్రీశైల దేవస్థానంలోని ఇద్దరు శాశ్వత ఉద్యోగులు సస్పెన్షన్

Srisailam

Srisailam

Srisailam Temple: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. గత నెల 27వ తేదీన హుండీ లెక్కింపులో చిల్లర సంచులను చంద్రావతి కళ్యాణ మండపంలో దేవస్థానం క్యాషియర్లు మంజునాథ్, శ్రీనివాసులు మరిచిపోయారు. బ్యాంకుకు అప్పజెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విచారణ జరిపిన ఆలయ ఈవో శ్రీనివాసరావు సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Eatala Rajendar: హైడ్రా దుర్మాగమైన ఆలోచన.. ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు..

అయితే, సస్పెండ్ అయిన ఇద్దరిలో ఒకరు ఇటీవల సాధారణ బదిలీలలో కాణిపాకం దేవస్థానానికి బదిలీ అయ్యారు. సస్పెండ్ అయిన ఉద్యోగిని కాణిపాకం దేవస్థానం ద్వారా సస్పెండ్ ఆర్డర్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. మర్చిపోయిన సంచిలో 10, 20 పైసలు, పావలా అర్ధ, రూపాయ, రెండు రూపాయల నాణెములు ఉన్నట్లు గుర్తించారు. సంచిలోని రూపాయ, రెండు రూపాయల నాణెములను అమ్మవారి ఆలయ హుండీలో అధికారులు వేశారు.

Exit mobile version