YS Jagan Dhone tour: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్ పర్యటనకు వెళ్లారు.. అయితే, వైఎస్ జగన్ డోన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.. వెల్దుర్తి హైవేపై టైరు పేలి ట్రాలీ ఆటో బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారగా.. మొత్తం 30 మందికి గాయాలు అయ్యాయి.. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి, వెల్దుర్తి ఆసుపత్రికి తరలించారు.. డోన్‌లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ కు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. బాధితులంతా బేతంచర్ల మండలం రుద్రవరంకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు..
కాగా, నంద్యాల జిల్లాలో పర్యటించిన వైఎస్ జగన్.. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. డోన్‌లో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌లో నూతన వధూవరులు అనన్య రెడ్డి, బుగ్గన అర్జున్ అమర్నాథ్‌లను ఆశీర్వదించారు జగన్.. ఇక, జగన్ రాకతో డోన్ జనసంద్రమైంది. ప్రియతమ నేతను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. వారికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు..
