Srisailam శ్రీశైలం మహాక్షేత్రంలో శివస్వాముల సందడి నెలకొంది.. కార్తీక మాసంలో శివ మాల ధరంచిన శివస్వాములు.. ఇప్పుడు శ్రీమల్లికార్జునస్వామికి ఇరుముడి సమర్పణ కోసం శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తారు.. ఈ నేపథ్యంలో సాధారణ భక్తుల కోసం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్జు చైర్మన్ రమేష్ నాయుడు కీలక నిర్ణయం తీసుకునారు.. ఈ నెల 7వ తేదీ వరకు ఇరుముడితో వచ్చే శివస్వాములకు ప్రత్యేకంగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనం ఉచితంగా కల్పించనున్నారు.. 7వ తేదీ వరకు ఇరుముడితో వచ్చే శివ స్వాముకు విడతల వారీగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.. మరోవైపు, సాధారణ భక్తులకు స్పర్శ దర్శనాలు రద్దు చేశారు.. సాధారణ భక్తులకు సైతం ఇబ్బందులు కలగకుండా శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నారు..
Read Also: Pyyavula Keshav: ప్రతి అర్జీకి పరిష్కారం చూపించాల్సిందే..
అయితే, భక్తుల రద్దీ పెరడంతో మల్లికార్జున స్వామి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది.. ఇక, క్యూలైన్లలో శివస్వాములు, సాధారణ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.. ఇరుముడితో వచ్చిన శివస్వాములకు రెండు గంటలకు ఒకసారి స్పర్శదర్శనానికి అనుమతి ఇస్తున్నారు.. మరోవైపు, మిగతా సమయంలో సాధారణ భక్తులకు శ్రీస్వామివార అలంకార దర్శనం కల్పిస్తున్నారు.. క్యూలైన్‌లో వేచిఉండే భక్తులకు ఎప్పటికప్పపడు అల్పాహారం, మంచినీరు సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు వెల్లడించారు..
