Srisailam Temple: ఆషాఢ మాసం ముగిసింది.. శ్రావణ మాసం ప్రారంభంమైంది.. ఈ నేపథ్యంలో నేటి నుండి శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు.. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.. నేటి నుండి శ్రావణమాసమంతా అఖండ శివనామ భజనలు చేయనున్నారు.. అయితే, ఈ ఉత్సవాల సమయంలో శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులకు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.. శ్రావణమాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా.. పాలక మండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు శ్రీస్వామివారి స్పర్శదర్శనం నిపుదల చేయనున్నట్టు వెల్లడించారు.. అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు..
మరోవైపు.. భక్తుల రద్దీ దృష్ట్యా.. శ్రావణ శని, ఆది, సోమ, పౌర్ణమి రోజులలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు, ఆర్జిత సేవలు రద్దుచేశారు.. శ్రావణామాసం రద్దీ రోజులు మినహా మిగిలిన రోజుల్లో 4 విడతలు సామూహిక అభిషేకాలు నిర్వహించనున్నారు.. రెండవ, నాల్గవ శుక్రవారాలలో ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేసుకునే వెలుసుబాటు కల్పించింది ఆలయ కమిటీ. కాగా, శ్రీశైలం డ్యామ్ నీటితో నిండుకుండలా మారపోవడం.. గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న తరుణంలో.. పెద్ద సంఖ్యలు ఇప్పటికే పర్యాటకులు, భక్తులు శ్రీశైలం తరలివస్తున్నారు.. కొందరు డ్యామ్ వరకు వచ్చేవారు అయితే.. చాలా మంది.. మల్లన్న దర్శనానికి వస్తున్నారు.. దీంతో.. ఇప్పటికే శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది.. ఇక, శ్రావణ మాసోత్సవాల నేపథ్యంలో.. శ్రీశైలం గిరిల్లో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు.