NTV Telugu Site icon

Nandyal Vijaya Dairy Election: నంద్యాల విజయ డైరీ ఎన్నికలు రద్దు..!

Nandyal Vijaya Dairy

Nandyal Vijaya Dairy

Nandyal Vijaya Dairy Election: నంద్యాల విజయ డైరీలో ఖాళీగా ఉన్న ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికలను తాత్కాలికంగా రద్దు చేశారు.. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఆళ్గడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ అనుచరులు భారీ సంఖ్యలో వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో, పోలీసుల సలహా మేరకు నామినేషన్ ప్రక్రియ వాయిదా వేసినట్లు ప్రకటించారు నంద్యాల విజయ డైరీ ఎండీ ప్రదీప్..

Read Also: Bhopal : భోపాల్‌లో కుప్పకూలిన వంతెన.. తెగిపోయిన రెండు జిల్లాల సంబంధాలు.. ఇబ్బందుల్లో లక్షలాది మంది

భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిని సొసైటి అధ్యక్షుడిగా అనర్హత వేటు వేసింది పాలకవర్గం. దీనిపై న్యాయం కోసం హైకోర్టు ఆశ్రయించారు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. ఈ నేపథ్యంలో డైరీ డైరెక్టర్ల ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అయితే, నామినేషన్ ప్రక్రియ సరిగ్గా జరపట్లేదంటూ నిరసన తెలుపుతూ భూమా అఖిలప్రియ వర్గీయులు డైరీ గేట్లు తీసుకుని లోపలికి వెళ్లేందుకు యత్నించారు.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత కొద్దిసేపటికి పోలీసుల నామినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నామని ప్రకటించారు డైరీ ఎండీ ప్రదీప్. దీంతో డైరీ ప్రాంతం వదలి వెళ్లిపోయారు భూమా అఖిల ప్రియ వర్గీయులు. కొంత సమయం తీసుకుని ఎన్నికలు నిర్వహించాలా? లేదా హైకోర్టు నిర్ణయం తీర్వాత.. డైరెక్టర్ల ఎన్నికలకు వెళ్లారా? అనేది చూడాలి..