Site icon NTV Telugu

Nandyal Kidnap Case: ఆటో డ్రైవర్గా మారిన మాజీ సాఫ్ట్వేర్ ఇంజినీర్.. యువతిపై అత్యాచారం

Nandyala

Nandyala

Nandyal Kidnap Case: నంద్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. విశాఖపట్నం నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఏడాదిన్నర పాపతో కలిసి అర్ధరాత్రి దిగిన ఓ యువతి, ఆళ్లగడ్డ వెళ్ళేందుకు రైల్వే స్టేషన్ బయట ఆటోలో ఎక్కింది. ఆ ఆటో డ్రైవర్ సమర సింహ, యువతి ఒంటరిగా ఉండటంతో అవకాశాన్ని ఉపయోగించుకుని కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఆటోను దారి మళ్లించి దీబగుంట్లకు తీసుకెళ్లాడు. అదే సమయంలో కుండపోత వర్షంలో యువతిపై అత్యాచార యత్నం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, వాహనాల రాకపోకలతో భయపడిన సమర సింహ ఆమెను వదిలేశాడని చెప్పుకొచ్చారు.

Read Also: Kantara Prequel : తెలుగు స్టేట్స్‌లో ‘కాంతార ప్రీక్వెల్’కు కోట్ల డీల్ టాక్ – అంత రిస్క్ అవసరమా?

ఆ తర్వాత యువతి సమీపంలోని ఓ హోటల్‌లో తెల్లవారే వరకు తలదాచుకుని.. ఆ తర్వాత రోజు ఆళ్లగడ్డ చేరుకుని భర్తతో కలిసి నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. సీసీ ఫుటేజ్, సెల్‌ఫోన్ లొకేషన్స్ ఆధారంగా సమర సింహను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి, రిమాండుకు పంపారు. ఇక్కడ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆటో డ్రైవర్ సమర సింహ ఎం.టెక్‌ చదివి, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా డ్యూటీ కూడా చేశాడు. కానీ, కుటుంబ సమస్యల కారణంగా నంద్యాలకు వచ్చి ఆటో నడుపుకుంటున్నట్లు సమాచారం.

Exit mobile version