Site icon NTV Telugu

Srisailam: శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Srisailam

Srisailam

Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో రాత్రి వేళ బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజపటావిసర్జన, అంకురార్పణ పూజలను దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణకు ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకీలో ఊరేగించి ఆలయ ప్రదక్షిణ చేయించి ధ్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకువచ్చారు. అక్కడ వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు బ్రహ్మదేవుడిని ఆహ్వానించారు.

Read Also: Karan Johar : మా అమ్మ నన్ను లావుగా ఉన్నావని అనేది.. బరువు తగ్గడంపై కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు.!

పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో కన్యాదానం చేసిన మహావిష్ణువుతో పాటు సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేద మంత్రోచ్చారణలతో ఆహ్వానించారు. పంచాహిక దీక్షతో ఏడు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రేపు రెండో రోజులో భాగంగా భంగి వాహనంపై శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

Exit mobile version