Maha Shivaratri Brahmotsavam 2026: శ్రీశైలంలో రేపటి నుంచే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు

  • శ్రీశైలంలో రేపటి నుండి ఈనెల 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
  • బ్రహ్మోత్సవాలకు భక్తులకు సకల ఏర్పాట్లు సిద్ధం చేసిన దేవస్థానం ..
  • రేపు ఉదయం శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం..
  • ఎల్లుండి నుండి శ్రీస్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలు, గ్రామోత్సవం..
Srisailam Temple

Srisailam Temple

Maha Shivaratri Brahmotsavam 2026: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది.. శ్రీశైలంలో రేపటి నుండి ఈనెల 18వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనుండగా, భక్తులకు సకల ఏర్పాట్లు దేవస్థానం పూర్తి చేసింది.. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యాంశాల విషయానికి వస్తే.. శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో రేపు ఉదయం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. ఎల్లుండి నుండి శ్రీస్వామి, అమ్మవార్లకు వివిధ వాహనసేవలు మరియు గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో రేపటి నుండి ఈ నెల 18వ తేదీ వరకు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.. ఇక, జ్యోతిర్ముడి శివస్వాములకు మాత్రమే ఈ నెల 12వ తేదీ వరకు అది కూడా నిర్ణిత వేళల్లో స్పర్శ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.. శివ స్వాములు, భక్తుల రద్దీ దృష్ట్యా.. 40 లక్షల లడ్డూలు అందుబాటు ఉంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు..

Read Also: Calcium Rich Ladoo : ఎముకల బలానికి ‘కాల్షియం లడ్డు’.. కేవలం 90 క్యాలరీలతో ఇంట్లోనే ఇలా చేసుకోండి!

ఉచిత లడ్డూ: ఈనెల 13 నుండి 16 వరకు, 15, 16 తేదీల్లో టోల్గేట్ లేకుండా వాహనాలు అనుమతి ఇవ్వనున్నారు.. ఇక, ఈనెల 12న రాష్ట్ర ప్రభుత్వంచే శ్రీస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో భక్తుల తాకిడి పెరగనుంది.. దీంతో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో.. సకల ఏర్పాట్లను చేస్తున్నారు అధికారులు.. పుణ్యస్నానాలు, దర్శనాలు, వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు..