Nandyal: నంద్యాల జిల్లా ఆవుకు మండలం రామాపురంలో యూనియన్ బ్యాంక్ సిబ్బందిని బాధితులు నిర్బంధించి తాళం వేశారు. అయితే, 2019లో రైతుల పేరుతో నకిలీ బంగారం తాకట్టు పెట్టి చేతివాటం ప్రదర్శించిన బ్యాంకు సిబ్బంది.. బ్యాంకు గోల్డ్ అప్రైజర్ గా విధులు నిర్వహించే శ్రీనివాసులు రైతుల పేరుతో నకిలీ గోల్డ్ ను బ్యాంకులో తాకట్టు పెట్టి రైతులను మోసం చేసినట్లు గుర్తించారు. 19 మంది రైతుల పేరుతో 2,100 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి సుమారు రూ.38 లక్షల రుణాన్ని బ్యాంకు సిబ్బంది తీసుకుంది.
Read Also: Kalyan C: పైరసీ చేసే వారిని ఎన్‌కౌంటర్ చేయాలి.. నిర్మాత సి కళ్యాణ్ ఫైర్!
అయితే, గతంలో బ్యాంక్ ఆడిట్లో నకిలీ బంగారు బాగోతం బయటపడింది. నకిలీ బంగారంపై రుణాల వ్యవహారంలో అప్పట్లో రైతులను నిందితులుగా పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను సీజ్ చేసి ఖాతాలను హోల్డ్ లో బ్యాంకు అధికారులు పెట్టారు. ఆరేళ్లుగా బ్యాంకు అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని నిరసనగా యూనియన్ బ్యాంకుకు బాధిత రైతులు తాళం వేశారు.
