NTV Telugu Site icon

CM Chandrababu at Srisailam Temple: శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు..

Cbn

Cbn

CM Chandrababu at Srisailam Temple: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.. నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల పర్యటనలో భాగంగా మొదట శ్రీశైలం చేరుకున్న ఏపీ సీఎంకు.. సున్నిపెంటలోని హెలిప్యాడ్‌ దగ్గర మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.. ఆ తర్వాత రోడ్డు మార్గాన శ్రీశైలం మల్లన్న ఆలయనాకి చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: Indian Railway: దేశంలోనే నాన్ స్టాప్ రైలు.. 6 గంటల్లోనే 493 కి.మీల జర్నీ..!

అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించనున్నారు సీఎం చంద్రబాబు.. కృష్ణానదికి జలహారతి సమర్పిస్తారు. తర్వాత నీటిపారుదలశాఖ అధికారులతో భేటీ అవుతారు.. ముఖ్యమంత్రి. ఇక శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శిచి.. నీటి వినియోగదారుల అసోసియేషన్‌తో భేటీ అవుతారు. తిరిగి హెలికాప్టర్‌లో శ్రీ సత్యసాయి జిల్లా గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తారు.. ప్రభుత్వ పాలిటెక్నీకల్ కళాశాలలో లబ్దిదారులకు పింఛన్‌ అందిస్తారు.. సీఎం. అనంతరం మల్బరి ప్లాంటేషన్ షెడ్‌ను సందర్శించి .. పట్టు రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. తర్వాత గుండుమలలో కరియమ్మ దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. కరియమ్మ గుడి వద్దనే గ్రామస్తులతో చంద్రబాబు ఇంటరాక్షన్ ఉండనుంది.. మధ్యాహ్నం 3:25 నుంచి 4:25 వరకు స్థానికులతో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానం ద్వారా అమరావతికి తిరిగి బయల్దేరనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..