Site icon NTV Telugu

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు నందమూరి మోహనకృష్ణ రూ. 25 లక్షల విరాళం

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే భారీ వర్షాల వల్ల వరదలు వచ్చాయి. ముఖ్యంగా విజయవాడలోని బుడమేరు వాగు పొంగడంతో భారీ నష్టం వాటిలల్లింది. అయితే, ఈ వరద బాధితులకు ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద వరద బాధితులకు తమ వంతు సహాయంగా నందమూరి మోహనకృష్ణ, నందమూరి మోహన్ రూప నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి 25 లక్షల రూపాయల విరాళం అందజేశారు.

Read Also: Rishabh Pant: ధోనీ రికార్డును సమం చేసిన టీమిండియా వికెట్ కీపర్..

అయితే, నందమూరి మోహనకృష్ణ ఇన్స్టిట్యూట్లో చదివే రోజుల్లో గోల్డ్ మెడలిస్ట్.. అంతేకాక నందమూరి తారక రామారావు నటించిన బ్రహ్మంగారి చరిత్ర, అనురాగ దేవత, చండశాసనుడు, నందమూరి బాలకృష్ణ నటించిన పలు సినిమాలకు, విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేసిన శ్రీనివాస కళ్యాణం, అదే విధంగా తమిళ్ లో శివాని గణేషన్, ప్రభు నటించిన చరిత్ర నాయగన్, హిందీ లో ఫరూక్ షేక్ యాక్ట్ గర్వాలి బాహర్వాలి సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గానూ.. పలు సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా వ్యవహరించారు. కాగా, నందమూరి మోహన కృష్ణ, ఆయన కుమార్తె నందమూరి మోహన రూప తమ వంతు సహాయంగా వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడుని తామే స్వయంగా కలిసి 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

Read Also: RRB NTPC Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో3445 పోస్టులు..12 పాసైతే చాలు

ఇక, గతంలో కూడా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన్ రూప ఇదే విధంగా ఎంతో మందికి సహాయం చేయడం జరిగింది. టీటీడీ అన్నదాన ట్రస్ట్ కు విరాళాలు అందజేశారు. నందమూరి మోహన్ రూప గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా చురుకుగ్గా ప్రచార కార్యక్రమాల్లోనూ సైతం పాల్గొన్నారు.

Exit mobile version