రాష్ట్రం లో జగన్ పరిపాలనలో అన్ని వర్గాలు మోసపోయాయన్నారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.గుంటూరులో ఆయన మాట్లాడుతూ జగన్ మాయ మాటలకు మహిళలు, కార్మికులు, ఉపాధ్యాయులు అందరూ దారుణంగా మోసపోయారన్నారు. ప్రభుత్వం చేసిన మోసాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కేస్తున్నారని విమర్శించారు.
మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. వరుసగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మహిళా కమిషన్ ను అడ్డు పెట్టుకుని ప్రతి పక్ష నేత చంద్రబాబును భయపెట్టే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు బాధితురాలిని పరామర్శించారు. విపక్షనేత రాజ్యాంగ హక్కులను హరించి వేస్తున్నారు.
సీపీయస్ పై సమాధానం చెప్పలేని ప్రభుత్వం ఉపాద్యాయ సంఘాలను యూటీఎఫ్ నాయకులను వేధిస్తోందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ప్రభుత్వం కూలి పోవడం ఖాయం అన్నారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు.
Read Also: Atchannaidu: ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోంది
