Site icon NTV Telugu

ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే విద్యుత్‌ టారీఫ్‌ల పెంపుపై నిర్ణయం: సి.వి నాగర్జున రెడ్డి

2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు నూతన టారిఫ్‌లతో ప్రతిపాదనలు పంపాయని, ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్ (ఎలక్ట్రీసీటీ రెగ్యూలేటరీ కమిషన్‌) జస్టిస్‌ సి.వి నాగర్జున రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వీటిపై మూడు రోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. 12000 కోట్ల మేర అదనపు వ్యయం అవుతుందని డిస్కంలు ప్రతిపాదించాయన్నారు.

Read Also: ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుంచి చర్చలు జరుపుతాం: సజ్జల, బొత్స

దీన్లో 10000 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందన్నారు. 850 కోట్లు వినియోగదారుల నుంచి రాబట్టాలని ప్రతిపాదించాయన్నారు. టారీఫ్‌లు, స్లాబ్‌లలో మార్పులు చేస్తూ ప్రతిపాదనలు అందాయని నాగర్జునరెడ్డి తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత మా ప్రతిపాదనలు ఇస్తామని నాగర్జున రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సంస్థలనుంచి మొండి బకాయిలను వసూలు చేసే ప్రక్రియను గట్టిగా చేపడుతున్నట్టు వెల్లడించారు. ఇటీవల కాలంలో విద్యుత్‌ రూ.1000 కోట్ల మొండి బకాయిలను రాబట్టామన్నారు. విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాల అంశం కోర్టు పరిధిలో ఉన్నందున నిర్ణయం తీసుకోలేమని ఏపీ ఈఆర్‌సీ కమిషన్‌ చైర్మన్‌ నాగర్జున రెడ్డి అన్నారు.

Exit mobile version