NTV Telugu Site icon

Naga Babu Konidela: సీపీఐ నారాయణపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు.. గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడు..!

Nagababu

Nagababu

మెగాస్టార్‌ చిరంజీవి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు మెగా బ్రదర్‌ నాగబాబు.. తాజాగా మెగా బ్రదర్స్‌పై కామెంట్లు చేసిన నారాయణ.. చిరంజీవి ఊసరవెళ్లి లాంటి వ్యక్తి అని.. ఆయన్ను అసలు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు తీసుకు రావాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.. ఇక, పవన్‌ కల్యాణ్ ల్యాండ్‌ మైన్‌ లాంటి వాడు.. అది ఎక్కడ పేలుతుందో.. ఎవరిపై.. ఎప్పుడు పేలుతుందో కూడా తెలియదని.. ప్రణాళిక లేని వ్యక్తి అంటూ మండిపడ్డారు.. అయితే, నారాయణ కామెంట్లకు సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్‌ ఇచ్చారు నాగబాబు..

Read Also: America: స్వలింగ వివాహాల రక్షణ బిల్లుకు యూఎస్ హౌస్ ఆమోదం

‘ఇటీవలి కాలంలో మెగా అభిమానులు మరియు జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కానీ, మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే ఈ సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు.. కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి… కాస్త అన్నం పెట్టండి …! తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు.” అంటూ వరుస ట్వీట్లు చేశారు.. కాగా, జనసేన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న నాగబాబు.. అవకాశం దొరకినప్పుడల్లా ప్రభుత్వ విధానాలు ఎండగడుతున్నారు.. ఈ మధ్య గుడ్‌మార్నింగ్‌ సీఎం సార్‌ పేరుతో ఏపీలోని రోడ్ల పరిస్థితిపై జనసేన నిర్వహించిన డిజిటల్‌ క్యాంపెయిన్‌లోనూ ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే.