NTV Telugu Site icon

Nadendla Manohar: వాలంటీర్ వ్యవస్థ వల్ల పర్సనల్ డేటా పక్కదారి పడుతోంది

Nadendla Manohar

Nadendla Manohar

Nadendla Manohar Controversial Comments On Volunteer System: వాలంటీర్ వ్యవస్థ వల్ల పర్సనల్ డేటా పక్క దారి పడుతోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల ద్వారా తీసుకునే డేటా చోరీ అయితే.. ఆ బాధ్యత ఏ మంత్రి తీసుకుంటాడని ప్రశ్నించారు. 360 డిగ్రీస్ మోనిటిరింగ్ పేరుతో వాలంటీర్‌ల ద్వారా సేకరిస్తున్న డేటా ఎక్కడికి వెళ్తోందని నిలదీశారు. అదే విషయం అడిగితే.. వాలంటీర్‌లతో కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆధార్‌తో ప్రారంభమై.. డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ డేటా మొత్తం నానక్‌రామ్‌గూడలో ఉన్న ఓ కార్యాలయానికి వెళ్తుందని పేర్కొన్నారు. సీఎం పేషీలో జరిగిన డేటా చోరీకి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించిన ఆయన.. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన భాధ్యత లేదా? అని అడిగారు.

Actress Sindhu Dies: ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక.. ప్రాణాలు విడిచిన నటి!

వ్యవసాయ ప్రాంతంలో లాకులు తుప్పు పట్టి పోతున్నాయని.. ఇసుక పేరుతో పెద్దఎత్తున దోపిడీ జరుగుతోందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పోస్టింగ్‌ల కోసం పెద్దఎత్తున డబ్బు వసూలు చేస్తున్న పరిస్థితికి ఎవరు భాధ్యత తీసుకుంటారని నిలదీశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. సీబీఐని నమ్మనని చెప్పారని, సీఎం పేషీలో జరిగిన డాటా చోరీపై ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందాలని కోరారు. టీటీడీని వైసీపీ ఆర్థిక సంస్థగా మార్చేసిందని మండిపడ్డారు. శ్రీవాణి ట్రస్ట్‌లో జమ చేసే డబ్బుకు ఎందుకు రసీదులు ఇవ్వటం లేదన్నారు. తాను జనసేన అభ్యర్థిగా తెనాలి నుండే పోటీ చేస్తానని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Facebook Friend: ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పంపింది.. తియ్యని మాటలతో బుట్టలో పడేసింది.. చివరికి ట్విస్ట్ ఇచ్చింది