NTV Telugu Site icon

Annavaram Temple: సత్యదేవుని సన్నిధిలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు

Annavaram 1

Annavaram 1

నూతన సంవత్సరం వచ్చేసింది. కోటి ఆశలతో జనం న్యూ ఇయర్ కి స్వాగతం పలికారు. నూతన సంవత్సర వేడుకలు ఒకవైపు దేవాలయాలను దర్శించుకోవడం మరోవైపు సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. డిసెంబర్ 31వ తేదీ ఆంగ్ల సంవత్సర వేడుకలు పూర్తయ్యాక ..జనవరి ఒకటవ తేదీ వేకువజామునే లేచి, తలారా స్నానం చేసి.. ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయంగా వస్తోంది.

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయి. మహావిష్ణువు గరుడ వాహనం పై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల ఈ రోజు తప్పకుండా దేవాలయాలకు వెళ్లి దర్శనాలు చేసుకుని తరలించాలంటారు పెద్దలు.

Read Also:Pakistan: దిగజారిన పాకిస్తాన్ పరిస్థితి.. సిలిండర్లు లేక ప్లాస్టిక్ కవర్లలో వంటగ్యాస్..

రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్నవరంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేలా ప్రత్యేక వేదిక ఏర్పాటుచేశారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం సమయం పొడిగించారు. మధ్యాహ్నం 12 .30నుంచి 1.30వరకు స్వామివారికి నివేదనలు సమర్పణ ఆ సమయంలో దర్శనం నిలుపుదల చేస్తారు. ఉదయం 4 గంటలకు పంచ హారతులు, నీరాజన మంత్రపుష్పాల సేవ ఉంటుంది. ఉదయం 11 గంటలకు స్వామి అమ్మవార్లకు వెండి రథంపై ప్రాకార సేవ ఉంటుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వేలాదిమంది భక్తులు అన్నవరం వస్తారని అధికారులు చెబుతున్నారు.

ఇటు విశాఖలోని సింహాచల క్షేత్రం అందంగా ముస్తాబైంది. శ్రీ వరహాలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో జనవరి 2న నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇంఛార్జి ఈవో వి. త్రినాథ్ రావు ఆధ్వర్యంలో వైదిక సిబ్బంది సూచనల మేరకు ఆలయ ఇంజనీరింగ్ అధికారులు ఈ ఏర్పాట్లు పూర్తి చేశారు.. సుమారు 70 వేల మంది భక్తులు ఉత్తర ద్వారదర్శనంలో కొలువుండే స్వామిని దర్శించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో త్రినాధరావు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేశారు. భక్తులందరికీ ఉచితంగా పొంగలి, పులుసు ప్రసాదం అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: TIrumala: రేపటి నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం