Mukesh Kumar Meena Gives Interesting Updates About MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని.. బ్యాలెట్‌లో ఎమ్మెల్సీ ఓటింగ్ జరుగుతుందని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. బ్యాలెట్ కాబట్టి అది పూర్తయ్యే వరకు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రస్తుతం 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. తెలంగాణ నుంచి 500 జంబో బ్యాలెట్ బాక్సులను తెప్పించామని వెల్లడించారు. 10 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేయటానికి అనుమతి ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధి ఖర్చుపై లిమిట్ ఉండదన్న ఆయన.. ఇప్పటివరకు రూ.77 లక్షలతో పాటు లిక్కర్ కూడా సీజ్ చేశామని స్పష్టం చేశారు.
IND vs AUS: సెంచరీలతో విజృంభించిన కోహ్లీ, శుభ్మన్.. 571 పరుగులకి భారత్ ఆలౌట్
బోగస్ ఓట్లపై తమకు ఫిర్యాదులు వస్తున్నాయని.. సీపీఎం, టీడీపీల నుంచి ఫిర్యాదులు అందాయని ముఖేష్ కుమార్ పేర్కొన్నారు. అయితే.. తిరుపతి అర్బన్ నుంచి మాత్రమే తమకు ఈ ఫిర్యాదులు వచ్చాయని, మరెక్కడి నుంచి ఫిర్యాదులు లేవని స్పష్టం చేశారు. 663 పేర్లు బోగస్ ఓట్లని చంద్రబాబు పంపారని.. ఇప్పటికే 500 పేర్ల మీద విచారణ చేసి, ఈసీకి నివేదిక పంపామని చెప్పారు. మిగతా వాటి మీద కలెక్టర్ ఇంకా విచారణ చేస్తున్నారని, ఇవాళే నివేదిక ఇస్తారని తెలిపారు. అడ్రస్ తప్పని గుర్తించిన వారికి అర్హత ఉందా లేదా అనేది రిపోర్టు వచ్చిందన్నారు. ఒకే అడ్రస్ మీద ఎక్కువ ఓట్లు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు పరిశీలిస్తే.. వారంతా అదే ప్రాంతానికి చెందిన వారేనని గుర్తించామన్నారు. అడ్రస్‌లు సరిగా ఫీడ్ చేయలేదని గుర్తించి, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకున్నామన్నారు. అడ్రస్‌లో లేని వారు, చనిపోయిన వారికి సంబంధించి లిస్ట్ ఇప్పటికే పోలింగ్ స్టాఫ్‌కి పంపామని.. వీరిపై విచారణ చేసి, వీడియో గ్రాఫింగ్ తర్వాత మాత్రమే అనుమతి ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.
Girlfriend Attacks: మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి
బోగస్ ఓట్లని చెబుతున్న వాటిని పరిశీలించి.. యూనివర్సిటీ సర్టిఫికెట్, అసిస్టేషన్ చేసి ఉండాలో లేదో పరిశీలిస్తున్నామని ముఖేష్ కుమార్ తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్‌తో ఓటు హక్కు వినియోగిస్తే మాత్రం.. వారిపై తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రలోభాల పర్వంపై కూడా తమకు ఫిర్యాదులు వస్తున్నాయని.. వీటిని ఆయా జిల్లాల కలెక్టర్లకు విచారణకు పంపిస్తున్నామని చెప్పారు. నారా లోకేష్‌కు అనుమతి ఇవ్వడం కోసం ఈసీకి పంపామని.. అయితే వారి నుంచి ఇంకా రిప్లై రాలేదని అన్నారు. ఈలోపు సమయం అవడంతో.. నిబంధనల ప్రకారం అక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పామన్నారు.