Site icon NTV Telugu

AP SEC: ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా ముఖేష్ కుమార్ మీనా..

Mukesh Kumar Meena

Mukesh Kumar Meena

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధానాధికారిగా ముఖేష్‌ కుమార్‌ మీనా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది… 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముఖేశ్ కుమార్ మీనా… ఉమ్మడి ఏపీ కేడ‌ర్‌ను చెందినవారు.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ముఖేష్‌ కుమార్‌ మీనా.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీ కేడ‌ర్‌కు బ‌దిలీ అయ్యారు. ప్రస్తుతం ఏపీ వాణిజ్య ప‌న్నుల శాఖ ముఖ్య కార్యద‌ర్శిగా పనిచేస్తున్నారు.. ఇవాళ సాయంత్రం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ముఖేష్‌ కుమార్ మీనాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి విజ‌యానంద్ ప్రస్తుతం ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా కొనసాగుతుండగా.. సీఈసీ ఆదేశాలతో.. త్వరలోనే ముఖేష్‌ కుమార్ మీనా ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Read Also: Vimala Raman: కత్తిలాంటి చూపుతో కైపెక్కిస్తున్న కోలీవుడ్ బ్యూటీ

Exit mobile version