Site icon NTV Telugu

చంద్రబాబుకి ముద్రగడ లేఖ.. ఏముందంటే?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబుకి రాసిన లేఖలో ముద్రగడ అనేక విషయాలు ప్రస్తావించారు. తన సతీమణికి అవమానం జరిగిందని చంద్రబాబు కన్నీళ్లు కార్చడం ఆశ్చర్యం కలిగించింది. నాడు మా కుటుంబానికి చేసిన అవమానానికి ఆత్మహత్య చేసుకోవాల్సింది.

మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్య విరమించుకున్నాను. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం నాడు దీక్ష ప్రారంభిస్తే అవమానించారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ ఈడ్చుకెళ్లడం చంద్రబాబుకు గుర్తు లేదా ?చంద్రబాబు పుత్రరత్నం తరచూ పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని అవమానించమన్నారు.

చంద్రబాబుకి ముద్రగడ రాసిన లేఖ పూర్తిపాఠం

Exit mobile version