Site icon NTV Telugu

మంత్రి అప్పలరాజు పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

మంత్రి అప్పలరాజు పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టించడానికి మంత్రికి సిగ్గనిపించడం లేదా… ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని అడిగారు. పలాసలో పోలీసులు వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారా , ప్రజలకోసం పనిచేస్తున్నారా. టీడీపీ నుంచి ఇచ్చిన ఫిర్యాదులను పక్కన పడేశారు. వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే టీడీపీ వారి పై కేసులు పెట్టారు. మాకూ సోషల్ మీడియా ఉంది… మేం పోస్టులు పెట్టలేక కాదు.. మాకు సంస్కారం ఉంది అన్నారు.

ఇక మంత్రి అప్పలరాజు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి అని తెలిపారు. లేకపోతే టీడీపీ శ్రేణులు ,గౌతు కుటుంబం అభిమానులందరూ మీ పై తిరుగుబాటు చేస్తారు. ఇంకోమారు ఇవి రిపీట్ అయితే చూస్తూ ఊరుకోం. ఒక ఆడపడుచు స్టేషన్ కు వెళితే న్యాయం చేయరా… ఇదేనా మీ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే రక్షణ. దిశ చట్టం తెచ్చామని చెప్పింది ఇందుకేనా. మంత్రి అప్పలరాజును వెంటనే బర్త్ రఫ్ చేయాలి. సోషల్ మీడియా వేధింపుల పై మహిళా కమీషన్ , హ్యూమన్ రైట్స్ కు కూడా వెళతాం అని పేర్కొన్నారు.

Exit mobile version