Site icon NTV Telugu

MP Ram Mohan Naidu : గౌతు శిరీష కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు

Ram Mohan Naidu

Ram Mohan Naidu

ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తున్నారనే అభియోగంతో టీడీపీ మహిళా నేత గౌతు శిరీషకు నిన్న సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు స్పందిస్తూ.. గౌతు శిరీష కుటుంబాన్ని అణచివేయటానికి టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ర్టంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తుందని, ప్రజా సమస్యలపై గొంతు విప్పాలని ప్రయత్నిస్తే అరెస్ట్ చేయాలఇ భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చారిత్రక నేపథ్యం ఉన్న కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని, బీసీ మహిళకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో శిరీష మీద కేసులు పెట్టడం బట్టి తెలుస్తుందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశ్నించే గొంతు నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, గౌరవంగా ఉండాల్సిన డిపార్ట్ మెంట్, పెద్ద కేసులను ఛేదించాల్సిన సీఐడీ పొలీసులు ఇలాంటి చిన్న సమస్యలపై దృష్టి పెడుతున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. రూల్స్ కి , రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు తప్పుడు కార్యక్రమాలకు సహాకరిస్తున్నారన్న ఆయన.. పోలీసులు అతి ఉత్సాహాం ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రజల కోసం పొలీస్ పనిచేయటం లేదని, టీడీపీ నేతలను అణచివేయటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వ తీరును ప్రజలు హర్షించడం లేదని ఆయన మండిపడ్డారు.

Exit mobile version