NTV Telugu Site icon

రఘురామ కాళ్లకు గాయాలు ఉన్నాయి : సుప్రీం కోర్టు

గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు కేసు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈరోజు ర‌ఘురామ బెయిల్ పిటీష‌క్ కు సంబందించి విచార‌ణ సుప్రీం కోర్టులో జరిగింది. ర‌ఘురామ‌కు ఆర్మీ ఆసుప‌త్రిలో వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని, ఆ నివేదిక‌ను సీల్డ్ క‌వ‌ర్‌లో అందించాల‌ని, వైద్య‌ప‌రీక్ష‌ల‌ను వీడియో తీయాల‌ని ఆదేశించింది సుప్రీం కోర్టు. అయితే తాజాగా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుప‌త్రి మెడికల్ రిపోర్ట్ అందింది అని సుప్రీం కోర్టు తెలిపింది. ర‌ఘురామ‌కు కాలి వేలుకు ఫ్యాక్చర్ ఉంది. అలాగే ఇంకా ఇచ్చారా గాయాలు కూడా ఉన్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. దాంతో పోలీసులు కొట్టారనే మాట నిజమైందని… ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుల పారిస్థితి ఏంటి అని రఘురామ ప్రశ్నించారు. అయితే మాకు ఎవరైనా ఒక్కటే అని సుప్రీం కోర్టు తెలిపింది. కానీ ఆ గాయాలు తనకు తానే చేసుకున్నాడేమో మాకు తెలియదు అని సీఐడీ లాయర్ తెలిపారు. ఇక ఈ కేసులు ఠాధిపతి విచారణను మధ్యాహ్నం 2:30 కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.