Site icon NTV Telugu

R.Krishnaiah: బీసీలకు న్యాయం చేసింది జగనే

R.krishnaiah

R.krishnaiah

దేశంలో బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత ఏపీ సీఎం జగన్ కే దక్కుతుందన్నారు ఎంపీ ఆర్.కృష్ణయ్య. నంద్యాల జిల్లా నందికొట్కూరులో స్థానిక జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిసి నేత రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యము వచ్చినప్పటి నుంచి దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తీవ్రంగా మండిపడ్డారు. భారత పార్లమెంట్ లో మొట్టమొదటి సారిగా బీసీ బిల్లు ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి దే అన్నారు.

బిల్లు విజయం కోసం దాదాపు 15 పార్టీల మద్దతు కూడగట్టామని,అయితే బీజేపీ సపోర్ట్ చేయక పోవడంతో పార్లమెంట్ విజయం సాధించలేకపోయిందన్నారు. కానీ దాని విజయం సాధించేందుకు అన్ని విధాలా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ప్రతి బీసీ సోదరులు పోరాడటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గిస్తే కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ లో చట్టసభల్లో 44 శాతానికి పెంచిన ఘనత మాత్రం జగన్ కు దక్కుతుందని అన్నారు. అనంతరం నంద్యాల జిల్లా అధ్యక్షునిగా కురుమూర్తిని ప్రకటించడం జరిగింది.స్ధానిక బీసీ నేతలు ఎంపీ ఆర్.కృష్ణయ్య ను గజమాలతో సత్కరించారు.

Anurag Tagore : తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

Exit mobile version