NTV Telugu Site icon

సుప్రీంకోర్టుకు ర‌ఘురామ‌.. రెండు పిటిష‌న్లు దాఖ‌లు

Supreme Court

వైసీపీ రెబ‌ల్ నేత‌, నర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు వ్య‌వ‌హారం ఏపీలో సంచ‌ల‌నంగా మారింది.. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.. సుప్రీంకోర్టులో రెండు స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్లు దాఖలు చేశారు ఎంపీ రఘురామ తరపు న్యాయవాదులు… ర‌ఘురామ బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఒక స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. వ్యక్తిగత డాక్టర్ ద్వారా చికిత్స తీసుకోవటానికి అనుమతి నిరాకరణ మీద, పోలీసు కస్టడీలో రఘురామకి ప్రాణ హాని ఉందని ఆయన వై కేటగిరీ సెక్యూరీటీ కొనసాగించాలని మరో ఎస్ఎల్‌పీని దాఖ‌లు చేశారు.. రఘురామ కాలి గాయాలపై మెడికల్ రిపోర్టును ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులతో ఇప్పించాల‌ని సుప్రీంకోర్టుకు విన్న‌వించారు. అయితే, ఈ రెండు స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ల‌పై రేపు లేదా ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు.