Site icon NTV Telugu

GVL Narasimha Rao: విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు జాతీయ ప్రాధాన్యత ఇవ్వాలి.. కేంద్ర మంత్రికి జీవీఎల్ విజ్ఞప్తి

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

GVL Narasimha Rao: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి పనితీరు కోసం వర్కింగ్ క్యాపిటల్ సమస్యను తీర్చాలని కోరుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు భేటీ అయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ఎదుర్కొంటున్న తీవ్రమైన వర్కింగ్ క్యాపిటల్ సమస్యను అంతం చేయడానికి మంత్రిత్వ శాఖ జోక్యాన్ని కోరారు.

గత ఏడాది రూ.913 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన ఆర్‌ఐఎన్‌ఎల్.. ప్రస్తుత సంవత్సరంలో వర్కింగ్ మెటీరియల్ అందుబాటులో లేకపోవడం, అధిక ముడిసరుకు ధర, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఎంపీ జీవీఎల్, మంత్రికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. ఆర్ఐఎన్‌ఎల్‌లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ ఫైనాన్స్ వంటి నిర్వహణ స్థాయి స్థానాలను భర్తీ చేయాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన లేఖలో హైలైట్ చేశారు.

Venkaiah Naidu: అప్పుడు చాలా బాధపడ్డా.. వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు..

బలమైన, శక్తివంతమైన, లాభదాయకమైన ఆర్‌ఐఎన్‌ఎల్ విశాఖపట్నం ప్రాంతం, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభం వంటిదని పేర్కొన్న జీవీఎల్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వహణకు జాతీయ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో తాను భేటీ కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. వర్కింగ్ క్యాపిటల్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ముడిసరుకును మంత్రిత్వ శాఖ ముందస్తుగా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందని తెలియచేశారని చెప్పారు. ఆర్‌ఐఎన్‌ఎల్ తన సామర్థ్య వినియోగాన్ని పెంచుకునేందుకు ఈ వెసులు బాటు సహాయ పడుతుందని మంత్రి అభిప్రాయ పడ్డారు

Exit mobile version