Site icon NTV Telugu

Guntur Crime: త‌ల్లి, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఢీకొట్టిన రైలు.. ప్ర‌మాద‌మా..?

Crim News

Crim News

వివాహ సంబంధాలు ప్రాణాలు తీసుకునే పరిస్థిల‌కు దారి తీస్తున్నాయి. వారితో పాటు వారికి పుట్టిన పిల్ల‌ల భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందో అని వారితో పాటే ఆ చిన్నారుల ప్రాణాల‌ను సైతం తీసేందుకు వెనుకాడ‌టం లేదు త‌ల్లిదండ్రులు. కుటుంబ క‌ల‌హాలో.. లేక భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు, అత్త‌, మామ‌, ఆడ‌ప‌డుచుల వేధింపులో.. లేక ఒక‌రిపై ఇంకొరి వాద‌న‌ల‌తో వివాహేత‌ర సంబందాల‌కు దూర‌మై ఆత్మ‌హ‌త్య‌ల‌కు దారితీస్తున్నాయి. అయితే ఓత‌ల్లికి ఏం క‌ష్టం వ‌చ్చిందో ఏమోగానీ.. పట్టాలు దాటుతుందో ఏమో తెలియ‌దు కానీ.. లేక ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకే ఆప‌ట్టాల ద‌గ్గ‌రికి వ‌చ్చిందో తెలియ‌దు.. ఆమెను, తన ఇద్దరి పిల్లలను
రైలు ఢీ కొట్ట‌డంతో ప్రాణాలు వ‌దిలింది. ఈ ఘ‌ట‌న చూసిన ప్ర‌తి ఒక్క‌రికి క‌ళ్లీ ఆగ‌లేదు. వివ‌రాల్లో వెళితే..

తల్లి, ఇద్దరు పిల్లలను రైలు ఢీ కొట్ట‌డంతో.. ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో జ‌రిగింది. నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీకి చెందిన రమ్యతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు సోమవారం రాత్రి నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా.. ఈఘ‌ట‌న చోటుచేసుకుంది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్ట‌డంతో.. మృతురాలు రమ్య, ఆమె పిల్లలు రిషిక్ రెడ్డి(8), హంసిక(6)లు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. రైల్వే ఉద్యోగుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. మృతదేహాలను సత్తెనపల్లి ఆస్పత్రికి తరలించారు. రమ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో మంగళవారం తెల్లవారుజామున వారందరూ సత్తెనపల్లికి తరలివెళ్లారు.

అయితే ఈ సంఘటన ప్రమాదమా? లేక ఆత్మహత్యా? అనే విషయంలో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. కాగా.. పిల్లలిద్దరూ నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులోని ప్రేరణ స్కూల్లో చదువుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు చనిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
TRS : ఉప్పు నిప్పులా ఉన్న నేతల మధ్య సయోధ్య సాధ్యమేనా.? ఇంతకీ ఎవరా నేతలు.?

Exit mobile version